న్యూయార్క్ పిచ్ పై చేజింగ్ అంత కష్టమా!

టీ20 ప్రపంచకప్ లో తక్కువ స్కోర్లను ఛేజింగ్ చేయలేక జట్లు చతికలపడుతున్నాయి.దీనికి న్యూయార్క పిచ్చే ఒక ఉదాహరణ..ఎందుకంటే పాకిస్థాన్,భారత్ మ్యాచ్,బంగ్లా,సౌతాఫ్రికా మ్యాచ్ లే ఇందుకు కారణం.రెండు మ్యాచ్ లలో తక్కువ స్కోర్లు చేయలేక,పాకిస్థాన్,బంగ్లా విఫలమైయాయి.

New Update
న్యూయార్క్ పిచ్ పై చేజింగ్ అంత కష్టమా!

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. భారత్-పాకిస్తాన్ తరహాలోనేే లోయెస్ట్ స్కోర్‌ మ్యాచ్ ఇది. దీన్ని కాపాడుకోగలిగింది. ఈ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికాకు లభించిన మూడో గెలుపు ఇది. గ్రూప్ డీలో టాప్ పొజీషన్‌లో నిలిచిందీ టీమ్.

న్యూయార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది దక్షిణాఫ్రికా. బంగ్లాదేశ్ బౌలర్లకు తలవంచింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొనలేకపోయారు. మిగిలిన వాళ్లతో పోల్చుకుంటే ఓపెనర్ క్వింటన్ డికాక్- 18 ఫర్వాలేదనిపించుకున్నాడు.

44 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో హెన్రిచ్ క్లాసెన్- 44 తన ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడిక్కడ కూడా. 28 పరుగులతో డేవిడ్ మిల్లర్ అతనికి సహకారం అందించాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లు తన్జిమ్ హసన్ షకీబ్- 3, తస్కిన్ అహ్మద్- 2, రషీద్ హొస్సైన్ ఒక వికెట్ పడగొట్టారు. హొస్సైన్ మినహా ఏ ఒక్క బౌలర్‌ను కూడా ఓవర్‌కు ఆరు పరుగుల కంటే ఎక్కువ ఎకానమీని నమోదు చేయలేదు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అంతకంటే అధ్వాన్నంగా ఆడింది. 109 పరుగుల వద్దే ఆగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేయగలిగింది. నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ జట్టుకు ఇది తొలి ఓటమి.దక్షిణాఫ్రికా కంటే భిన్నంగా ఏమీ సాగలేదు బంగ్లా ఇన్నింగ్. 37 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హృదొయ్ ఒక్కడే టాప్ స్కోరర్. తన్జిద్ అహ్మద్- 9, కేప్టెన్ నజ్ముల్ హొస్సైన్ శాంటో- 14, లిట్టన్ దాస్- 9, షకీబల్ హసన్- 3, మహ్మదుల్లా- 20, జకర్ అలీ- 8 పరుగులు చేశారు. రషీద్ హొస్సైన్-0, తస్కిన్ అహ్మద్- 1 నాటౌట్‌గా నిలిచారు. జగన్‌‌ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే.. : చంద్రబాబు ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచారు బౌలర్లు. కేశవ్ మహరాజ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఎన్రిచ్ నోర్ట్జే- 2, కగిసొ రబడ- 2 వికెట్లు కూల్చారు. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 15వ తేదీన నేపాల్‌తో ఆడబోతోంది దక్షిణాఫ్రికా.

Advertisment
Advertisment
తాజా కథనాలు