Horrible: నరమాంస భక్షకుడు.. దెయ్యం చెప్పిందంటూ భార్యని చంపి మెదడు తినేశాడు..! మెక్సికోలో జరిగిన అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. 32ఏళ్ల అల్వారో తన భార్యని చంపేసి శరీర భాగాలను వేరు చేయడమే కాకుండా ఆమె మెదడుని వండుకొని తిన్నాడు. అంతేకాదు సిగరెట్ తాగుతూ ఆమె పుర్రెని ఆష్‌ట్రేగా వినియోగించుకున్నాడు. By Trinath 07 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మెక్సికోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. 32ఏళ్ల అల్వారో..తన భార్య మరియాను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె శరీరంలోని భాగాలను ముక్కలు చేశాడు. అందులో కొన్ని అవయవాలను బ్యాగ్‌లో ప్యాక్ చేయగా..మిగిలిన వాటిని వండుకొని తిన్నాడు. ఐదుగురు పిల్లల తల్లి అయిన తన భార్యను అల్వారో ఇంత ఘోరాతిఘోరంగా ఎందుకు చంపాడు..? అసలేంటి మెక్సికో క్రైమ్ కథ..? అల్వారో (రైట్), మరియా(లెఫ్ట్) ఇదేం పిచ్చి..? నిత్యం దెయ్యలకు పూజలు, ప్రార్థనలు చేస్తుంటాడు.. పిచ్చి పట్టినవాడిలా నోటికి వచ్చింది అరుస్తుంటాడు. దెయ్యాలు,భూతాలు తనతో మాట్లాడుతాయని చెబుతుంటాడు. వీడి పిచ్చి తెలియని ఓ పిచ్చిది పాపం పెళ్లి చేసుకుంది. అప్పటికీ ఐదుగురికి పిల్లల తల్లి కావడంతో.. మొదటి భర్త మోసం చేయడంతో..ఇంట్లో వాళ్లు మంచి సంబంధం చూశారని భావించి వివాహానికి అంగీకరించింది. పెళ్లి చేసుకున్నాక తన భర్త ప్రవర్తన చూసి జీవితంపై విరక్తి కలిగినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కూతుర్లను కంటికిరెప్పలా కాపాడాల్సిన అల్వారో వాళ్లపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. దీంతో ఐదుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దరి పిల్లలతో కలిసి మరియా అతనితో ఉంటుంది. నిత్యం దెయ్యలతో మాట్లాడుతున్నట్టు భ్రమ పడే అల్వారో తనకు ఏవో మాటలు వినిపిస్తున్నాయంటూ భార్యకు చెప్పాడు. ఆమెను చంపమని దెయ్యాలు చెబుతున్నాయని వేధించాడు. రోజూ ఇలానే మాట్లాడుతున్నాడులే అని మరియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే తన కొంపముంచింది. కానిబల్స్ ( ప్రతికాత్మక చిత్రం) కూతురిపై నిందమోపే ప్రయత్నం: దెయ్యలు కోరిక తీర్చాలని ఓ రోజు ఊగిపోతూ మరియా రూమ్‌లోకి వచ్చిన అల్వారో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. శరీరంలోని అవయవాలను వేరు చేశాడు. కొన్నిటిని ప్యాక్ చేసి ఇంట్లోనే పెట్టాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అంతా అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత మరియా బ్రెయిన్‌ని వండుకొని తిన్నాడు. సిగరెట్ తాగుతూ ఆమె పుర్రెని ఆష్‌ట్రేగా వినియోగించుకున్నాడు. రెండు రోజుల తర్వాత పెద్ద కూతురికి కాల్ చేశాడు. అమ్మని చంపేశానని.. ఆ హత్య నువ్వే చేసినట్టు పోలీసుల దగ్గర లొంగిపోమని బెదిరించాడు. వెంటనే భయపడి ఫోన్ పెట్టేసిన పెద్ద కూతురు ఈ విషయాన్ని అమ్మమ్మకు చెప్పింది. ఆమె హుటాహూటిన పోలీసుస్టేషన్‌కి వెళ్లి జరిగిందంతా చెప్పింది. పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి అల్వారో ఇంటికి చేరుకున్నారు. అల్వారో హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు. అతనికి దెయ్యాలు, భూతాలు అంటూ పూజలు చేసే అలవాటు ఉందని ఎంక్వైరీలో తేలింది. ఈ ఘటన మెక్సికో వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన తర్వాత కానిబల్స్(cannibals)పై చర్చ మొదలైంది. నియాండర్తల్(ప్రతికాత్మక చిత్రం) కానిబల్స్ అంటే..? మనిషిని చంపి..వాళ్ల మాంసాన్ని తినే మనుషులుంటారు. వాళ్లని కానిబల్స్(Cannibal)అంటారు. ఇలా మనుషులను చంపి తినేవాళ్లు కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంటారు. భారత్‌లో అఘోరాలు, దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఉండే గిరిజనులు మనిషి మాంసం తింటారు. ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నరమాంసాన్ని తింటారు. నిజానికి మన పూర్వికులైన నియాండర్తల్‌లు నరమాంస భక్షణను చేసేవాళ్లని సైంటిస్టులు చెబుతుంటారు. ఈజిప్ట్ , రోమ్‌లలో 1199-1202మధ్య మహా కరువుకాటకాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తోటి మనుషుల శవాలను కాల్చుకోని తినేవాళ్లని చరిత్ర చెబుతోంది. నియాండర్తల్‌లు తర్వాత మనిషి రూపాంతరం చెందుతున్న సమయంలో ఆధునికంగా తోటి మనిషిని మరో మనిషి తినడం కరువు సమయాల్లోనే జరిగిందన్నది చరిత్రకారుల మాట. అయితే ఇప్పటికీ కొన్ని తెగలు మాత్రం ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి. వీళ్లంతా మనిషిని హత్య చేసి తింటారని భావించవద్దు.. చనిపోయిన మనిషినే తింటారు. కానీ మెక్సికోలో అల్వారో మాత్రం తన భార్యను చంపేసి వండుకొని తిన్నాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి