జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, వర్క్ టైమింగ్స్.. ఇలా ఏ కారణం అయితేనేం క్యాన్సర్ కేసులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ రేట్ తగ్గినప్పటికీ, రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి రెండు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలతో పొల్చితే క్యాన్సర్ కేసుల సంఖ్య మనకు స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇది రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రతీఏడాది క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 14 లక్షలుగా ఉన్న కేసులు.. 2040నాటికి ఏడాదికి 20లక్షల చొప్పున కేసులు నమోదవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
దేశంలో అనేక కారణాల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి:
జీవనశైలి మార్పులు: ఆధునికీకరణ, పట్టణీకరణ జీవనశైలిలో మార్పులకు దారితీసింది. ఎక్కువ మంది ప్రజలు ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ కాలుష్య కారకాలకు గురికావడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోంది.
వృద్ధాప్య జనాభా: వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం సాధారణంగా పెరుగుతుంది.
ఎక్కువ మంది స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. ఇది మంచి విషయమే. ముందుగానే రోగనిర్ధారణ చేస్తుండడంతో ఎక్కువ కేసులు నమోదవుతాయి.
జన్యు కారకాలు: కొన్ని రకాల క్యాన్సర్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి జన్యుపరమైన అంశాలు కారణం అవుతాయి.
పర్యావరణ కారకాలు: కాలుష్యం, రేడియేషన్ లాంటి పర్యావరణ కారకాలకు గురికావడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారం: ఆహారపు అలవాట్లలో మార్పులు, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం క్యాన్సర్ కేసుల పెరుగుదలకు దోహదపడతాయి.
ఇన్‌ఫెక్షన్‌లు: హెపటైటిస్-బీ, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) లాంటి కొన్ని ఇన్‌ఫెక్షన్‌లు క్యాన్సర్‌లతో ముడిపడి ఉంటాయి.
అటు ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నోరు, పెదవులు, నాలుక, గొంతు క్యాన్సర్ కేసులు వివిధ కారణాల వల్ల పెరుగుతున్నాయి.
పొగాకు: ధూమపానం, గుట్కా, పాన్ లాంటి పొగాకు ఉత్పత్తుల వాడకం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. పొగాకులోని హానికరమైన రసాయనాలు నోరు, గొంతులోని కణాలను దెబ్బతీస్తాయి.
ఆల్కహాల్ వినియోగం: ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకోవడం నోటి క్యాన్సర్‌లకు ముఖ్య కారణం.
ఆహారం: పండ్లు, కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం, అవసరమైన పోషకాల లోపం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఓరల్ హైజీన్: పేలవమైన నోటి పరిశుభ్రత, చిగుళ్ల వ్యాధి ఉండటం, చెడుగా అమర్చిన కట్టుడు పళ్ళు లేదా పదునైన దంతాల లాంటివి క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
Also Read: మనసులను లాక్ చేసే లిప్స్.. లేలేత అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
WATCH: