/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/thumbs-up-emoji.jpg)
ఎమోజీలతో మాట్లాడుకునే కాలమిది. కష్టపడి పేరాలకు పేరాలు రాసే బదులు.. ఒక్క ఎమోజీతో సంభాషన ముగించేసే వాళ్లుంటారు. ఒక్కొక్క ఎమోజీకి ఒక్కొక అర్థం ఉంటుంది. కొన్ని ఎమోజీలకు రెండు,మూడు అర్థాలు కూడా ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. వాట్సాప్ లేదా ఇతర సోషల్‌మీడియా యాప్స్‌లో ఎమోజీలదే హవా. ఎమోజీలు లేని కన్వర్‌జేషన్ ఉండదు. చదవడం రాని వాళ్లు కూడా ఎమోజీలతో అవతలి వాళ్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎమోజీలకు అంత పవర్ ఉంది. అందుకే దాన్ని ఎడాపెడా వాడకూడదు. అలా వాడిన ఓ రైతు రూ.50లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఛాట్ మధ్యలో యూజ్ చేసిన 'థంబ్స్ అప్' ఎమోజీ అతని కొంపముంచింది. కోర్టు చివాట్లతో డబ్బులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇదేంటి ఎమోజీ వాడితే కోర్టు తిట్టడమేంటి..డబ్బులు కట్టడమేంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ రియల్ స్టోరీ చదవాల్సిందే..!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/thumbs-up-emoji.jpg)
బిజినెస్ డీల్స్ థ్రూ మొబైల్:
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించని వాళ్లు చాలా అరుదుగా ఉన్న ఈ రోజుల్లో ఫోన్ ఛాటింగ్‌ల్లోనే బిజినెస్ డీల్స్ జరుపుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బిజీబిజీ బతుకుల్లో వాట్సాప్ లేదా ఇతర సోషల్‌మీడియా యాప్స్‌లో చాటింగ్‌లలో అక్షరాలను పొదుపుగా వాడుతుంటారు. అదే ఆ రైతు పాలిట శాపంగా మారింది. కెనడాలో క్రిస్ అచ్టర్ అనే రైతుకు కెంట్ మిక్కిల్‌బరో అనే కొనుగోలుదారుడికి మధ్య నడిచిన ఓ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు ఆ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. క్రిస్, కెంట్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధముంది. క్రిస్ రైతు కావడంతో అతని వద్ద నుంచి తనకు కావాల్సినవి కొనుగోలు చేస్తుంటాడు కెంట్. అలా క్రిస్, కెంట్ మధ్య చాలా కాలంగా ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సారి క్రిస్ అమ్ముతున్న ఫ్లాక్స్(అవిసె గింజల) కావాలని కెంట్ అడిగాడు. అందుకు అంగీకరంగానో..ఏమో తెలియదు కానీ.. క్రిస్ 'థంబ్స్ అప్' ఎమోజీని పంపాడు. అక్కడే క్రిస్ పప్పులో కాలేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/guy-2617866_1280.jpg)
ఇక్కడే అసలు ట్విస్ట్:
క్రిస్ తనకు ఫ్లాక్స్ పంపిస్తాడని చాలా కాలం వెయిట్ చేశాడు కెంట్. అయితే నెలలు గడుస్తున్నా కోరియర్ మాత్రం రాలేదు. క్రిస్‌కి కాల్ చేసిన కెంట్ ఈ విషయం గురించి ప్రస్తావించాడు. అందుకు క్రిస్ సరిగ్గా సమాధానం చెప్పలేదు. పైగా తిరిగి తిట్టాడు. దీంతో కెంట్‌కి కోపం వచ్చింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇరువురి వాదనాలు విన్న కోర్టు క్రిస్‌ని డబ్బులు కట్టాలని తీర్పునిచ్చింది. క్రిస్ తప్పు చేసినట్టు ధ్రువీకరించింది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ ఛాటింగ్‌ని నిశితంగా పరిశీలించిన జడ్జి క్రిస్ మోసం చేసినట్టు అభిప్రాయపడ్డాడు.
అసలు క్రిస్ ఎందుకు ఇలా చేశాడు:
ఫ్లాక్స్ అమ్ముతావా అని కెంట్ మొదట అడిగినప్పుడు అంగీకరించిన క్రిస్ తర్వాత ప్లేట్ తిప్పేశాడని విచారణలో తేలింది. నిజానికి క్రిస్ ఇలా చేయడానికి కారణం గిట్టుబాటు ధర లేకపోవడం. క్రిస్‌కి కెంట్ పంపిన మెసేజ్‌లో 86 టన్నుల ఫ్లాక్స్‌ను 12.73డాలర్లకు ఇస్తావా అని అడిగాడు. అంటే భారత కరెన్సీలో 1,050రూపాయలు. ఆ మెసేజ్ కిందనే క్రిస్ 'థంబ్స్ అప్' ఎమోజీ పెట్టాడు. అంటే ధరకు కూడా క్రిస్ అంగీకరించినట్టే లెక్కా. అయితే కొద్దీ రోజులకే ఫ్లాక్స్ ధరలు అమాంతం పెరగడంతో క్రిస్ గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. జడ్జి దగ్గర అసలు తాను 'థంబ్స్ అప్' ఎమోజీ పెట్టడానికి కారణం డీల్‌ని అంగీకరించడానికి కాదంటూ బుకాయించాడు. అయితే గతంలో 24సార్లు ఈ ఇద్దరి మధ్య జరిగిన డీలింగ్స్‌లో ప్రతిసారీ 'థంబ్స్ అప్' ఎమోజీనే డీల్‌కి అంగీకరంగా ఉన్నట్టు పాత ఛాటింగ్‌లు చూస్తే జడ్జికి అర్థమైంది. అందుకే జడ్జి ఈ విధమైన తీర్పునిచ్చారు. 'థంబ్స్ అప్' ఎమోజీనే అంగీకారానికి సింబల్‌గా భావిస్తామని కోర్టు కుండబద్దలు కొట్టింది.