/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Canada-Stury-Permit-jpg.webp)
Canada Study Permit: కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఈ సంవత్సరం అంటే 2024లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లలో 35% తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రకటన భారత దేశ విద్యార్థులు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే, కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది భారతీయులే. అందులోనూ ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉంటారు. కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల ఎడ్మిషన్ పర్మిట్స్ విషయంలో వచ్చిన నిర్ణయంతో ఈ సంఖ్య తగ్గిపోనుంది. కేవలం 3.64 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పర్మిట్లు(Canada Study Permit) దొరుకుతాయి. గతేడాది అంటే 2023తో పోలిస్తే ఇది 35% తక్కువ. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి సంబంధించి ఈ సంఖ్య ఎంత ఉండవచ్చు అనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ సంవత్సరం చివరిలో ఆ సంఖ్య చెబుతారని ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ వెల్లడించారు. కెనడాలో పెరుగుతున్న ఇళ్ల కొరతతో పాటు, నిరుద్యోగ సమస్యను నివారించడం కోసమే ఈ పర్మిట్లలో(Canada Study Permit) కోత తీసుకువస్తున్నామని ఆయన వివరించారు.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై ఈ పరిమితి రెండేళ్లపాటు ఉండే తాత్కాలిక విధానం అని చెబుతున్నారు. ఇది ప్రస్తుత స్టడీ పర్మిట్ హోల్డర్లు(Canada Study Permit) లేదా రెన్యువల్స్ ను ప్రభావితం చేయదు. అలాగే ఇందులో పీజీ అలాగే మెడిసిన్ విద్యార్థులకు వర్తించదు. వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పర్మిట్లను ప్రావిన్స్ ల వారీగా కేటాయిస్తారు. ఆయా ప్రావిన్స్ ల స్థానిక ప్రభుత్వాలు అక్కడ ఉన్న సంస్థలు, వనరుల ఆధారంగా పర్మిట్లను(Canada Study Permit) పంపిణీ చేయాల్సి ఉంటుంది. సంస్థలకు వచ్చిన పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్ లేదా టెరిటరీలు యాక్సెప్టెన్స్ లెటర్స్ ఇష్యూ చేస్తాయి. దీని కోసం కెనడా ప్రభుత్వం మర్చి 31 వరకూ వారికి గడువు ఇచ్చింది.
Also Read: బాల రాముడు కొలువయ్యే వేళ.. బంగారం ధరలు ఎలా వున్నాయంటే..
అదేవిధంగా వర్క్ పర్మిట్ల విధానంలోనూ కెనడా మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం కరిక్యులం లైసెన్సింగ్ ఎరేంజ్మెంట్స్ కింద నమోదు అయిన విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌కు అర్హులు కాదు. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేదిగా ఉందనడంలో సందేహం లేదు.
Watch this interesting Video: