health tips: గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొచ్చా? గుండె రోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మనం తినే ఆహారంలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటే కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం! By Durga Rao 30 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి గుండె రోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మనం తినే ఆహారంలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటే కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి లేదా వెన్న తినడం తగ్గిస్తే మంచిదంటున్నారు నిపుణులు. నెయ్యి లేదా వెన్నలో కొవ్వు అధికంగా ఉండటం కారణంగా సమస్య పెద్దదయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదుఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇంట్లో తయారు చేసిన నెయ్యి.. చాలా మంది గుండె సమస్యలున్నవారు తమ డైట్‌లో నెయ్యి లేదా వెన్న లేకుండా జాగ్రత్త పడతారు. హృద్రోగులు ఇంట్లో తయారుచేసిన వెన్న లేదా నెయ్యిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చట. అలానే జున్ను, బీన్స్, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినొచ్చని సలహా ఇస్తున్నారు. చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని దూరం పెట్టడం మంచిదంటున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలి ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. సరైన సమయంలో ఆహారం తినడం, సమయానికి నిద్ర పోవడం వంటి అలవాట్లను పాటించడం చాలా ముఖ్యమంటున్నారు ఇపుణులు. అలాగే మద్యపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది. నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి