మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి... మోదీకి రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్...! కూటమి పేరులో ఇండియా వుంటే సరిపోదు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. మోడీజీ...‘మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి... ఉయ్ ఆర్ ఇండియా'' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మణిపూర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. By G Ramu 25 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కూటమి పేరులో ఇండియా వుంటే సరిపోదు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. మోడీజీ...‘మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి... ఉయ్ ఆర్ ఇండియా'' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మణిపూర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. మణిపూర్ లో మహిళల, చిన్నారుల కన్నీళ్లు తుడిచేందుకు తోడ్పతామని పేర్కొన్నారు. మణిపూర్ ప్రజల్లో ప్రేమ, శాంతి తీసుకు వస్తామన్నారు. మణిపూర్ అనేది భారతీయ ఆత్మ అనే భావనను మళ్లీ పునర్నిర్మస్తామని వెల్లడించారు. అంతకు ముందు విపక్షాల ఇండియా కూటమి పేరుపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ... ఏ దశ దిశ లేకుండా విపక్షాలు ముందుకు వెళుతున్నాయని మండిపడ్డారు. ఒక లక్ష్యం లేకుండా ముందుకు వెళ్లే విపక్షాలను తాను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారంలోకి రావాలని విపక్షాలు అనుకోవడం లేదన్నారు. ఎప్పడూ విపక్షంలో వుండి పోవాలని అనుకుంటన్నట్టు వున్నాయంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. కేవలం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వాళ్లు ఆ పేరు(ఇండియా)ను ఎంచుకున్నారని ఆరోపించారు. అలా చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీలో, ఇండియన్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా వుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి