Car: కారు కొంటున్నారా? ఈ కారును బుక్ చేసుకోండి. రూ. 65వేల డిస్కౌంట్ లభిస్తోంది..ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!!

చాలా కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ఇస్తు స్టాక్ ఖాళీ చేస్తున్నారు. మారుతీ సుజుకీ కూడా కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. మారుతీ ఇగ్నిస్ రూ. 65వేల వరకు తగ్గింపు ఇస్తోంది.

Car: కారు కొంటున్నారా? ఈ కారును బుక్ చేసుకోండి. రూ. 65వేల డిస్కౌంట్ లభిస్తోంది..ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!!
New Update

Maruti Ignis: 2023 కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ఇస్తు స్టాక్ ఖాళీ చేస్తున్నారు. మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు.ఈ నెలలో మారుతీ ఇగ్నిస్ రూ. 65వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 40వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ. 15వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ 10వేల వరకు కార్పొరేట్ తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రయోజనాలు డిసెంబర్ 31 , 2023 వరకు చెల్లుబాటులో ఉండనున్నాయి. డీలర్ షిప్ ప్రాంతం, కారు రంగు, వేరియంట్ స్టాక్ లభ్యత, ఇతర అంశాలను బట్టి ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంది. కచ్చితమైన తగ్గింపు గణాంకాలను తెలుసుకునేందుకు మీరు మీ సమీప మారుతీ డీలర్ షిప్ ను సంప్రదించవచ్చు.

publive-image

ఇగ్నిస్ దాని ఇంజిన్ పనితీరు కారణంగా ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది. దాని 1.2లీటర్ సహజంగా ఆశించిన 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ దాని అద్భుతమైన పవర్ కు ప్రసిద్ధి చెందింది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బీహెచ్ పీ శక్తీని. 113 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యానువల్ 5 స్పీడ్ ఆటేమెటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది.

ఇగ్నీస్ ప్రీమియం, అప్ డేట్ చేసిన ఇంటీరియల్ ను కలిగి ఉంది. ఈ కారులో ఐదురుగు సులభంగా కూర్చోని ప్రయాణించవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది స్మార్ట్ ప్లే స్టూడియో ఫీచర్ తో కూడిన ఏడు అంగుళా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. కాల్స్, మ్యూజిక్ , నావిగేషన్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కంపెనీ కారు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్లో ఉంటుంది.

maruti ignis

ఈ కారులో కంపెనీ నెక్సా సేఫ్టీ షీల్డ్ కూడా అందించింది. సేఫ్టీ ద్రుష్టిలో ఉంచుకుని ఇగ్నిస్ కు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఈబీడీతో కూడిన ఏబీఎస్ బ్యాక్ డోర్ చైల్డ్ లాక్, బ్యాక్ పార్కింగ్ కెమెరా చైల్డ్ సీట్ లాక్ యాంకర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ తన నెక్సా ప్రీమియం డీలర్ షిప్ ద్వారా ఇగ్నిస్ అమ్ముతోంది. దీన ధర రూ. 5.84లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ రూ. 8.16లక్షల వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ఇది టాటా, టియాగో, హ్యుందాయ్ ఐ10, టాటా పంచ్ లకు పోటీగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: లారీ డ్రైవర్లకు రవాణ మంత్రి శుభవార్త.. రాత్రి పూట ఫ్రీగా టీతో పాటు..!

#maruthi-sujuki #maruti-ignis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe