Samsung Galaxy M35 5G Offer: ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ దుమ్ము దులిపేస్తుంది. అంతేకాకుండా తక్కువ ధరలో మరికొన్ని ఫోన్లను రిలీజ్ చేస్తూ బడ్జెట్ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మరి మీరు కూడా బడ్జెట్ ధరలో ఒక మంచి శాంసంగ్ 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ఇటీవలే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రకటించింది. ఈ సేల్‌లో శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
అందులో Samsung Galaxy M35 5G ఫోన్ ఒకటి. ఇది ఇటీవలే లాంచ్ చేయబడింది. 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఇది ఎక్సీనోస్ 1380 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో కంపెనీ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌ను అందించింది. అలాగే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించబడింది. అలాగే ఫోన్‌కి శక్తినివ్వడానికి ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.
Samsung Galaxy M35 5G Offer
Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.24,499 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ సేల్ సమయంలో రూ.14,999కే కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.9,500 డిస్కౌంట్ లభించిందన్నమాట. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
SBI క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌లపై రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. లేదా SBI డెబిట్ కార్డు ట్రాన్సక్షన్‌లపై రూ.1000 డిస్కౌంట్ వస్తుంది. దీంతో క్రెడిట్ కార్డుపై కొంటే రూ.13,749కే లభిస్తుంది. అదే డెబిట్ కార్డుపై కొంటే రూ.13,999కే పొందొచ్చు. ఇవి కాకుండా భారీ రూ.14,150 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో శాంసంగ్ ఫోన్‌ని కేవలం రూ.849కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. మోడల్ బట్టి ధర నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఇంతపెద్ద మొత్తంలో డిస్కౌంట్ వర్తిస్తే మాత్రం దీనిని స్మార్ట్‌వాచ్ ధరకే కొనుక్కోవచ్చన్నమాట.
Samsung Galaxy M35 5G Specifications
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. OIS మద్దతుతో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.