TATA Family : దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్ వంశవృక్షం చాలా పెద్దదే. 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైన టాటా గ్రూప్ కు చెందిన 100 కంపెనీలుండగా 150 దేశాల్లో ఉత్పత్తులు విస్తరించాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత పొందిన టాటా గ్రూప్ వంశవృక్షానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి వందల సంఖ్యలో వ్యాపారవేత్తలున్నారు. రతన్ టాటా తండ్రి పేరు నావెల్ టాటా. ఆయనను రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. టాటా గ్రూప్ సంస్థలు స్థాపించిన జెమ్‌షెడ్‌జీ టాటా కుమారుడే ఈ రతన్‌జీ టాటా. అయితే నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు. టాటా వంశం ఆయన నుంచే మొదలవగా.. పార్సీ పూజారి అయిన నసర్వాన్‌జీ టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి.
ఐదుగురు సంతానం..
నుస్సర్వాన్‌జీ టాటాకు ఐదుగురు పిల్లలు. ఇందులో ఒకరు ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా. ఇయనే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వ్యాపారాలను ప్రారంభించారు. 1839లో జన్మించి 1904లో చనిపోయిన ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పేర్కొంటారు.
దొరాబ్జీ టాటా
దొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారం బాధ్యతలు నిర్వర్తించారు. 1859 జన్మించి1932లో చనిపోగా.. టాటా పవర్ వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ ప్రాధన పాత్ర ఉంది.
రతన్ జీ టాటా
రతన్‌జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. 1871లో జన్మించి 1918లో చనిపోయిన ఈయన.. టాటా గ్రూప్ పత్తి- వస్త్ర పరిశ్రమల వ్యాపారాలను ప్రవేశపెట్టాడు.
జేఆర్‌డీ టాటా
జేఆర్‌డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. ఇతను రతన్‌జీ టాటా, సుజానే బ్రియర్‌ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా. కాగా ఆయన అతని జీవితకాలం 1904-1993.
నావల్ టాటా
నావల్ టాటా. ఇతను రతన్‌జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా పనిచేశారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌ల కొనుగోలులో నావల్ టాటా కీలక పాత్ర పోషించారు. నావల్ టాటా ఇంటర్నేషనల్ టాటా వ్యాపారాలకు చైర్మన్‌గా ఉన్నారు. నావల్ జీవిత కాలం 1904- 1989.
రతన్ టాటా
రతన్ టాటా.. నావల్ టాటా, సునీ కమిషరియట్‌ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఇయన జీవిత కాలం 1937 -2024.
నోయల్ టాటాకు ముగ్గురు కుమారులు
రతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటాకు ముగ్గురు కుమారులు. మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను చూసుకుంటున్నారు.
Also Read : కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా? జరిగేది తెలిస్తే షాకే!