సింగిల్ ఛార్జింగ్‌పై 34 గంటల బ్యాటరీ లైఫ్.. మోటో కొత్తఫోన్ అదుర్స్!

మోటోరోలా తన లైనప్‌లో ఉన్న ‘థింక్‌ఫోన్25’ని అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌ వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 34 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Motorola ThinkPhone 25
New Update

Motorola ThinkPhone 25: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యధికంగా సేల్ అవుతున్న కంపెనీ ఫోన్లలో మోటోరోలా ముందు వరుసలో ఉంటుంది. వినియోగదారుల బడ్జెట్‌కి తగ్గట్లుగా కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సామాన్యులే లక్ష్యంగా ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో మొబైళ్లను పరిచయం చేసిన కంపెనీ ఇప్పుడు మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన లైనప్‌లో ఉన్న Motorola ThinkPhone 25 స్మార్ట్‌ఫోన్‌ని అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. 

ఇది 6.36 అంగుళాల పోఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, పూర్తి స్పెసఫికేషన్ల విషయానికొస్తే..

Motorola ThinkPhone 25 Price 

ఇదికూడా చదవండి: బంపరాఫర్.. రూ.5,299కే కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్, మరీ ఇంత చీపా..!

Motorola ThinkPhone 25 ధర విషయానికొస్తే.. కంపెనీ ప్రస్తుతం దీనిని యూకే మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అక్కడ కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ 450 పౌండ్లు ఉంది. అయితే ఇది భారతదేశ కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.50,000గా నిర్ణయించబడింది. వచ్చే నెల అంటే నవంబర్ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్ కలర్‌ ఆప్షన్‌లో రానుంది. 

Motorola ThinkPhone 25 Specifications

Motorola ThinkPhone 25 స్మార్ట్‌ఫోన్ సూపర్ HD రిజల్యూషన్‌తో 6.36 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. HDR10+కి మద్దతు ఇస్తుంది. ఇది గరిష్టంగా 3000 nits వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఇందులో కంపెనీ థింక్‌షీల్డ్ సెక్యూరిటీని అందించింది. అలాగే మూడేళ్ల వారంటీ కూడా లభిస్తుంది. దీంతోపాటు మోటో ఏఐ, 5 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందించబడ్డాయి. 

ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ అందించబడింది. అలాగే 10 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. కంపెనీ ఇందులో MediaTek Dimensity 7300 SoC ప్రాసెసర్‌ను అందించింది.

ఇది ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్సా‌తో వచ్చింది. ఇందులో కంపెనీ 68 వాట్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. దీనికి ఒక్కసారి ఛార్జింగి పెడితే హై యూసేజ్‌లో సైతం 34 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అంతేకాకుండా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe