Ganapathi Laddu Auction: ఈ మేరకు 1994నుంచి హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రసిద్ధిగాంచింది. ఎప్పటిలాగే గతేడాది ఈ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. 2023 లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. అయితే ఈసారి మరింత పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లడ్డూ వేలంపై ఈ ఏడాది భారీ అంచనాలున్నాయి. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు నిర్వాహకులు. ముందుగా 27లక్షలు కట్టిన వాళ్ళకే వేలంలో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈసారి 30 లక్షలకు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడుతున్నారు.
రూ.1.26కోట్ల నుంచి 1 కోటి 87లక్షలు..
2023 బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాలో వినాయకుని లడ్డూకు భారీ ధర పలికింది. ఏకంగా రూ.1.26కోట్లకు ఇక్కడి లడ్డూను వేలంపాటలో అసోసియేషన్ ప్రతినిధులు దక్కించుకున్నారు. అయితే 2024 లడ్డూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్లగొండలో పాతబస్తీలో రూ.30 లక్షలు..
నల్లగొండలో పాతబస్తీ హనుమాన్ నగర్‌లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ రూ.30 లక్షలు పలికింది. మైం హోం భూజా లడ్డూ రూ.25.5 లక్షలు పలికింది. హైదరాబాద్ నగర శివారు మధురాపురంలో సేవా సమితి గణపతి లడ్డూ 11 లక్షలకు దక్కించుకున్నారు. పుప్పాలగూడలోని అల్కాపూర్ టౌన్ షిప్ లడ్డూ వేలం 10 లక్షలు.
హుడా కాలనీలో 3 లక్షల 25 వేలు..
మణికొండలో నవజ్యోతి యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డూ 9 లక్షలు. కేపిహెచ్‌బిలోని సర్దార్ పటెల్ నగర్ లో లడ్డూ ప్రసాదం 5 లక్షల వెయ్యి రూపాయలు. మణికొండ హుడా కాలనీలో 3 లక్షల 25 వేలు. మణికొండ లోని SM సాయి హిల్స్ లో 2 లక్షల 55 వేలు. మేడిబావి గణేశ్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూ 2 లక్షల 45 వేలు పలికింది.