Google Layoffs: ఉద్యోగులకు గూగుల్ భారీ షాక్.. మరోసారి భారీగా లేఆఫ్స్!

టెక్ దిగ్గజం గూగుల్ 2025లో 200 ఉద్యోగాలను తొలగించింది. AI టెక్నాలజీ దిశగా ముందుకెళ్లే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ లోని 'గ్లోబల్ బిజినెస్' యూనిట్ కి సంబంధించిన ఉగ్యోగులను తొలగించింది.

New Update
google layoffs 2025

google layoffs 2025

Google Layoffs:  ప్రపంచ ప్రఖ్యాత టెక్  దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాలకు కోత విధించింది. తమ 'గ్లోబల్ బిజినెస్' యూనిట్ నుంచి 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభమైన 5 నెలల వ్యవధిలో గూగుల్ లేఆఫ్స్ ప్రకటించడం ఇది మూడోసారి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా 

గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ప్రస్తుతం..  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, infrastructure అభివృద్ధి దిశగా తమ దృష్టిని మళ్లిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  మరోవైపు గూగుల్ తమ ఉద్యోగుల తొలగింపుపై స్పందిస్తూ.. ''అంతర్గతంగా కొన్ని చిన్న మార్పులు చేస్తున్నాము. కస్టమర్ సర్వీస్ మెరుగుపరిచే లక్ష్యంగా తప్పక తీసుకున్న నిర్ణయం ఇది'' అని పేర్కొంది.  ఇప్పుడు గూగుల్ తొలగించిన 200 మంది ఉద్యోగులు 'గ్లోబల్ బిజినెస్ ఆర్గ నైజేషన్ కి ' చెందినవారు. ఈ యూనిట్ గూగుల్ సేల్స్ , పార్ట్నర్ షిప్ విషయాలను  పర్యవేక్షిస్తుంది.

గూగుల్ మాత్రమే కాదు గతంలో Android, Pixel, క్రోమ్, అమెజాన్  వంటి  అనేక టెక్ కంపెనీలు తమ విభాగాల నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించాయి. 2023 ప్రారంభంలో Alphabet సంస్థ ఏకంగా 12, 000 ఉద్యోగాలను తొలగించినట్లు ప్రకటించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపు 6% అని తెలిసింది.  2024   డిసెంబర్ నాటికి గూగుల్‌ లో  183,000కి పైగా ఉద్యోగులు ఉన్నారు.

Business Updates 2025 | Google Layoffs News | google-layoffs | AI Jobs Impact 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు