Nairobi Airport Case : ఆదానీకి షాకిచ్చిన కెన్యా కోర్టు.. ఎందుకంటే.. కెన్యా రాజధాని నైరోబీలోని అతిపెద్ద విమానాశ్రయం జోమో కెన్యాట్టాను లీజుకు తీసుకునేందుకు అదానీ కంపెనీ చేసిన ప్రయత్నాన్ని అక్కడి కోర్టు నిలిపివేసింది. అక్కడి ప్రజలు, కార్మిక సంఘాల నిరసనల మధ్య కెన్యా కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. By KVD Varma 11 Sep 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Nairobi Airport Case:అదానీ కంపెనీకి వ్యతిరేకంగా కెన్యాలో నిరసనలు కొనసాగుతుండగా.. భారతీయ కంపెనీకి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కెన్యా రాజధాని నగరం నైరోబీలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగించాలన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. Nairobi Airport Case:కెన్యాలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అదానీ గ్రూప్‌తో కెన్యా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన తరువాత 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ప్రతిపాదన ఉంది. ఈ 30 ఏళ్లలో విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ సంస్థ నిర్వహిస్తుంది. ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయడంతోపాటు ఆదాయంలో వాటాను అదానీ గ్రూప్ పొందుతుంది. Nairobi Airport Case: అయితే నైరోబీ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూపునకు ఇవ్వాలన్న ప్రతిపాదన అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ప్రజల నిరసనలు వెల్లువెత్తాయి. కెన్యా ఏవియేషన్ వర్కర్స్ యూనియన్ కూడా దీన్ని వ్యతిరేకించింది. దీంతో అక్కడ ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూవస్తున్నారు. యూనియన్ల మద్దతుతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదానీకి విమానాశ్రయం అప్పగించడంపై వ్యతిరేకత ఎందుకు? అక్కడ ఈ విషయంలో నిరసనలు వ్యక్తం కావడానికి విమానాశ్రయ నిర్వహణను విదేశీ కంపెనీకి అప్పగించడం ఒక కారణం. అలాగే విమానాశ్రయ నిర్వహణ విదేశీ కంపెనీకి దక్కితే స్థానికులకు ఉద్యోగాలు రావనే భయం కూడా అక్కడి ప్రజల్లో ఉంది. ఇక ఇక్కడ పనిచేయడానికి విదేశీ ఉద్యోగులను తీసుకువస్తుండడం వారిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కెన్యా ప్రభుత్వం ఏం చెబుతోంది? Nairobi Airport Case: ఈ విషయంలో విమానాశ్రయాన్ని అమ్మడం లేదని ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీతో డీల్ ఇంకా ఖరారు కాలేదని కెన్యా ప్రభుత్వం వివరిస్తోంది. మొత్తంగా చూసుకుంటే, కోర్టు స్టే ఇవ్వడంతో నైరోబీ ఎయిర్ పోర్ట్ విషయంలో అదానీ గ్రూపునకు గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also Read : క్రూడ్ ఆయిల్ ధర మారలేదు.. పెట్రోల్ రేట్ అలానే ఉంది #adani-group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి