పెప్సీ (Pepsi), కోకాకోలా (Coca Cola) డ్రింక్స్ అంటే అందరూ ఇష్టం తాగుతారు. ముఖ్యంగా బిర్యానీ తినే సమయంలో అయితే తప్పకుండా ఈ డ్రింక్స్ ఉండాల్సిందే. అయితే రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తీసుకొచ్చిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా (Campa) నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్‌లో పెప్సీ, కోకాకోలా నుంచి సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తోందట.
ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
కాంపా డ్రింక్‌లకు డిమాండ్ పెరగడంతో..
ఇప్పుడున్న ధరల కంటే 15 నుంచి 20 శాతం తక్కువ ధరకి లభించేలా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే కాంపా సాఫ్ట్ డ్రింక్‌లకు డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ గతేడాది కాంపా సాఫ్ట్ డ్రింక్స్‌ను కొనుగోలు చేసింది. మిగతా కంపెనీలతో పోలిస్తే అతి తక్కువ ధరలకే డ్రింక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!
దీంతో కోకాకోలా, పెప్సీ డ్రింక్‌ల డిమాండ్ బాగా తగ్గిపోయింది. మళ్లీ మార్కెట్‌లో వాటి డిమాండ్‌ను పెంచుకోవడానికి తక్కువ బడ్జెట్‌లో డ్రింక్‌లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కాంపా సాఫ్ట్ డ్రింక్స్ నుంచి తమ కంపెనీలను కాపాడుకోవడానికి కొత్తగా వ్యూహాలను ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
మార్కెట్లో ప్రస్తుతం 200 ఎంఎల్ కాంపా బాటిల్ ధర రూ.10 ఉండగా.. పెప్సీ, కోకాకోలా 250 ఎంఎల్ బాటిల్ ధర రూ.20గా ఉంది. కాంపా 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.20 ఉంటే కోకాకోలా రూ.30 ఉండగా, పెప్సీ రూ.40 ఉంది. 1980కి ముందు మార్కెట్లో కాంపా సాఫ్ట్ డ్రింక్స్ ఉండేవి. కానీ కోకాకోలా, పెప్సీ వచ్చిన తర్వాత కాంపా డ్రింక్స్ ఉన్న విషయం కూడా మరిచిపోయారు.
ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!