అమెజాన్ ఆఫర్ల జాతర.. రూ.10,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ కొనసాగుతోంది. ఇందులో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం15, రెడ్‌మి 13సి, పోకో ఎం6, నోకియా జి 42, లావా బ్లేస్ వంటి 5జీ స్మార్ట్‌ఫోన్లను కేవలం రూ.10,000 లోపు ధరలో కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.

New Update
Under Rs 10,000 5g Smartphones

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. దీని కారణంగానే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సైతం దేశంలో దర్శనమిస్తున్నాయి. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. అయితే ఇప్పుడంతా 5జీ మయమైపోవడంతో ప్రతి ఒక్కరూ 4జీ నెట్‌వర్క్ ఫోన్లకు స్వస్తి పలికి 5జీ నెట్వర్క్ ఫోన్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొబైల్ కంపెనీలు అధిక ధరలతో రిలీజ్ చేసి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి.

మార్కెట్‌లోకి వస్తున్న ప్రతీ కంపెనీ ఫోన్ అధిక ధరతో కూడుకున్నవే. దీంతో సామాన్యులు తమ బడ్జెట్‌కు తగిన ఫోన్‌ను కొనుక్కోవాలని పలు ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలోనే, అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో కేవలం రూ.10 వేల లోపు కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌ సేల్‌లో అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. దీని 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ.15,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌ సేల్‌లో31 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.10,999లకే లిస్ట్ అయింది. దీనపై బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులోఉన్నాయి. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదే సమయంలో రూ.250 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్లతో Samsung Galaxy M15 5G ఫోన్‌ను కేవలం రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.10,350 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. 

ఇది కూడా చదవండి: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

Redmi 13C 5G

రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Redmi 13C 5G. దీని 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999గా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు సేల్ సమయంలో దీనిని 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,999 కే సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునే వారికి ఇది ది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేవు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సమయంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. దాదాపు రూ.8,500 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు లభిస్తుంది. ఇది మొత్తం వర్తిస్తే Redmi 13C 5G ఫోన్ కేవలం రూ.499కే సొంతం చేసుకోవచ్చు. 

POCO M6 5G

POCO M6 5G స్మార్ట్‌ఫోన్ సైతం రూ.10వేల లోపు ధరలో లభిస్తుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు 32 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,499 కే లిస్ట్ అయింది. అయితే దీనిని రూ.9,249లకే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు లేవు. కానీ రూ.8,950 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. 

POCO X6 Neo 5G

POCO X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సమయంలో రూ.19,999 ధరను కలిగి ఉంది. అయితే ఇప్పుడు సేల్‌లో 35 శాతం తగ్గింపుతో రూ.12,999లకే లిస్ట్ అయింది. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. SBI డెబిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.1000, SBI క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1000 తగ్గింపు పొందచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోచ్చు. ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దాదాపు రూ.12,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇది సగం వర్తించినా రూ.10 వేల కంటే తక్కువకే ఫోన్ వస్తుంది. దీంతో పాటు Nokia G42 5G, Lava Blaze 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  

Advertisment
Advertisment
తాజా కథనాలు