దేశవ్యాప్తంగా జులై 7వ తేదీన 10 లక్షల మెుబైల్ యూనిట్లు విక్రయించబడతాయని రిలయన్స్ ప్రకటించింది. వినియోగదారులు వీటిని సమీపంలోని రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. జియో భారత్ వీ2,4జీ అనే పేరుతో లాంచ్ అయిన ఈ ముబైల్‌ని కేవలం 999 రూపాయలకే అందించనుండడం మరో విశేషం. ఈ ఫీచర్ స్మార్ట్ 4G ఫోన్ అపరిమిత కాల్స్ చేయడానికి, ఫోటోలను క్లిక్ చేయడానికి, జియో-పేని ఉపయోగించి యూపీఐ చెల్లింపులను చేసేందుకు యూజర్లకు వీలు కల్పిస్తుంది.
అన్నీ ఫీచర్స్‌తో జియో 4జీ మొబైల్
అలాగే జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రిలయన్స్ జియో కొత్త ఫోన్ల కోసం ప్రత్యేకంగా జియో భారత్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. ఈ ప్లాన్స్ కేవలం రూ.123 నుంచి ప్రారంభం అవుతాయి. ఇతర ఆపరేటర్ల రూ.179 వాయిస్ కాల్స్, 2GB డేటాతో పోలిస్తే.. బేసిక్ రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా కోసం నెలకు రూ.123 ధరగా నిర్ణయించామని జియో తెలిపింది. వార్షిక ప్లాన్‌లో రూ. 1,234 ఛార్జీ విధిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 168 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ )ఉంటాయి. వాయిస్ కాల్స్, 24జీబీ డేటాతో ఇతర ఆపరేటర్ల వార్షిక ప్లాన్ రూ. 1,799తో పోలిస్తే.. 25 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది.
ఇంటర్నెట్-ఎనేబుల్డ్ జియో భారత్ ఫోన్‌లను అందించడమే కంపెనీ లక్ష్యం
జియో భారత్ ప్లాట్‌ఫాం ఎంట్రీ-లెవల్ ఫోన్‌లలో ఇంటర్నెట్ - ఎనేబుల్డ్ సర్వీసులను అందించడానికి డివైజ్, నెట్‌వర్క్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ రిటైల్‌తో పాటు, కార్బన్‌తో ప్రారంభించి ఇతర ఫోన్ బ్రాండ్‌లు జియో భారత్ ఫోన్‌లను రూపొందించింది. భారత మార్కెట్లో ఇప్పటికీ 2G-ఎనేబుల్ ఫీచర్ ఫోన్‌లను దాదాపు 250 మిలియన్ల మందికి ఇంటర్నెట్-ఎనేబుల్డ్ జియో భారత్ ఫోన్‌లను అందించడమే కంపెనీ లక్ష్యమని జియో పేర్కొంది.