పాన్ ఆధార్ లింక్ చేయలేదా?.. రేపటి నుంచి జరగబోయే పరిణామాలివే!

పాన్, ఆధార్‌ లింక్ చేయడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించింది. మరోసారి గడువు పొడిగిస్తుందో లేదో తెలియదు. చివరిసారిగా పొడిగించిన గడువు ప్రకారం జూన్ 30 చివరి తేదీ. ఈ గడువు ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఇప్పటికే తమ పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ కావట్లేదని పలువురు కంప్లైంట్ చేస్తున్నారు.

పాన్ ఆధార్ లింక్ చేయలేదా?.. రేపటి నుంచి జరగబోయే పరిణామాలివే!
New Update

business-pan-aadhaar-link-you-may-face-these-consequences-if-not-linked-pan-card-and-aadhaar-card1

భారత ప్రభుత్వం 2017లో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. పాన్, ఆధార్ లింక్ చేయడానికి అనేకసార్లు అవకాశమిచ్చింది. గడువు పొడిగిస్తూ వస్తోంది. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ హోల్డర్స్ పలు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఆధార్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డులు జూలై 1 నుంచి చెల్లవు. పాన్ కార్డ్ చెల్లకపోతే ఆర్థిక లావాదేవీలు జరిపేవారు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ కింద వివరించిన సమస్యలు తప్పవు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఓ ట్వీట్ చేసింది. పాన్, ఆధార్ లింక్ కాకపోవడానికి కారణమేంటో వివరించింది. మీ పాన్, ఆధార్ ఎందుకు లింక్ కావట్లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

మీ డబ్బుపై ప్రభావం చూపే అంశాలివే... జూలైలో ఈ రూల్స్ గుర్తుంచుకోండి

1. చెల్లని పాన్ కార్డుతో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు.

2. పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ ప్రాసెస్ కావు.

3. పాన్ కార్డ్ చెల్లనప్పుడు పెండింగ్‌లో ఉన్న రీఫండ్స్ రావు.

4. సవరణలతో ఫైల్ చేసిన రిటర్న్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్ పూర్తి కావు.

5. పాన్ కార్డ్ పనిచేయకపోతే అధిక రేటుతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పాన్, ఆధార్ లింక్ చేయనివారు రూ.1,000 పెనాల్టీ చెల్లించి ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయొచ్చు. పాన్ ఆధార్ లింక్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

Step 1- ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ఎడమవైపు Link Aadhaar పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 4- పేమెంట్ కోసం ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 5- e-pay Tax పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6- ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి.

Step 7- ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 8- ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

ఈ ప్రాసెస్‌తో చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4-5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Step 1- ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ఎడమవైపు Link Aadhaar పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 4- మీ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి.

Step 5- కంటిన్యూ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6- మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

Step 7- ఓటీపీ ఎంటర్ చేసి పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe