New SIM Card Rules: ఒక వ్యక్తికి 9 సిమ్‎ల కన్నా ఎక్కువ ఉండొద్దు.. డిసెంబరు 1 నుంచి కొత్త రూల్స్

కొత్త సిమ్ కార్డులకు సంబంధించి భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్ లైన్ ఆర్థిక మోసాలను, అక్రమంగా సిమ్ కార్డుల జారీని నిరోధించేందుకు టెలి కమ్యూనికేషన్ విభాగం వీటిని తీసుకొచ్చింది.

New Update
New SIM Card Rules: ఒక వ్యక్తికి 9 సిమ్‎ల కన్నా ఎక్కువ ఉండొద్దు.. డిసెంబరు 1 నుంచి కొత్త రూల్స్

New SIM Card Rules: ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా సిమ్‌ కార్డుల విక్రయానికి సంబంధించి భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన కొత్త నిబంధనలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గత ఆగష్టులోనే ఈ నిబంధనలను ప్రకటించినప్పటికీ వాయిదా పడుతూ నేటి నుంచి అమలవుతున్నాయి.

ఈ నిబంధనల ప్రకారం సిమ్ కార్డ్ విక్రేతలకు నమోదు తప్పనిసరి. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్లు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. బల్క్ కనెక్షన్ల నిబంధనను రద్దు చేయడంతో పాటు నకిలీ సిమ్‌ల వల్ల జరిగే మోసాల తీవ్రతను బట్టి నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు, జైలు శిక్ష అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారికి ఏజెంట్లు సిమ్ కార్డ్‌లు అందించకుండా నిరోధించవచ్చు. నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వారు మూడేళ్ల పాటు బ్లాక్ లిస్టును ఎదుర్కొంటారు, లేదా లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఆ నియోజకవర్గాల్లో 90 శాతం దాటిన పోలింగ్.. ఎవరికి అనుకూలం?

కొత్త సిమ్ కార్డు కొనాలనుకునే వారు వ్యక్తిగత వివరాలను విధిగా అందించాలి. డిజిటల్ వెరిఫికేషన్ తప్పనిసరి. సిమ్ కార్డు ఇచ్చే ఏజెంట్ కొనుగోలు దారుడి ఆధార్ క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా వివరాలు సేకరిస్తారు. ముద్రిత ఆధార్‌ దుర్వినియోగం కాకుండా చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ విధానాన్ని చేపట్టిందని తెలుస్తోంది. డిజిటల్ కేవైసీని పాటించలేకపోతే డీలర్‌‌పై రూ. 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మొబైల్ నంబర్ ను డిస్ కనెక్ట్ చేసేందుకు కూలాఫ్ పిరియడ్ గా 90 రోజుల సమయం ఉంటుంది. అంటే ఆ నంబరును 90 రోజుల తర్వాతే కొత్త వ్యక్తికి కేటాయించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

కేంద్ర ప్రభుత్వ కొత్త సిమ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన ఐడీతో గరిష్టంగా 9 సిమ్ కార్డులకు మించి కొనుగోలు చేయలేడు. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ అకౌంట్లకు ఖాతాలకు ఈ నిబంధన వర్తించదు. కానీ వారు ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చన్న విషయమై స్పష్టత రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు