ఐటీ రంగంలో లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ దిగ్గజం టీసీఎస్

అసలే ఐటీ పరిశ్రమకు గడ్డుకాలం దాపురించింది. దిగ్గజ కంపెనీలు కూడా చేతిలో ఆర్డర్లు లేక ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. కానీ దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ మాత్రం లాభాల్లో దూసుకెళ్తోంది. ఈ ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసికంలో టీసీఎస్ తన ఆదాయాన్ని, లాభాలను మరింత పెంచుకుంది. ఎఫ్‌వై 24 ఫస్ట్ క్వార్టర్‌లో ఈ కంపెనీ నికర లాభం 17 శాతం వృద్ధి చెంది 11,074 కోట్లను ఆర్జించింది. ఆదాయం వచ్చేసి 12.55 శాతం పెరుగుదలతో 59,381 కోట్లకు చేరింది.

ఐటీ రంగంలో లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ దిగ్గజం టీసీఎస్
New Update

టీసీఎస్ కంపెనీ మొత్తం లాభం ఈ త్రైమాసికంలో 10,880 కోట్లుగా ఉంటుందని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేశాయి. కానీ వారి అంచనాలకు మించి టీసీఎస్ రాణించింది. అలాగే ఆదాయ అంచనాలు కూడా 59,000 కోట్లుగా ఉంటుందని ఆర్ధిక సంస్థలు అంచనా వేశాయి. ఈ అంచనాలకు మించి టీసీఎస్ రాణించింది. గత యేడాది జూన్ క్వార్టర్‌లో టీసీఎస్, 9,478 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఈ యేడాది మార్చ్‌ క్వార్టర్‌లో కూడా 11,392 కోట్ల నికర లాభాలను సాధించింది. కాగా బుధవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో కంపెనీ షేర్ కు 9 రూపాయిల చొప్పున డివిడెండ్ ను ప్రకటించింది.

దీర్ఘకాలిక డిమాండ్‌ ఉంటుందన్న ఆశాభావం

టీసీఎస్‌ ఆర్డర్‌ బుక్‌ జోరుగా ఉందని, ప్రస్తుతం 10.2 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు ఉన్నాయని నూతనంగా నియమితులైన సీఈవో, ఎండీ కృతివాసన్‌ వెల్లడించారు. కొత్తగా వచ్చిన టెక్నాలజీల ఫలితంగా తమ సర్వీసులకు దీర్ఘకాలిక డిమాండ్‌ ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. గ్లోబల్‌ గా చూస్తే ఉత్తర అమెరికా ఆదాయ వృద్ధి 4.6 శాతానికి తగ్గింది. దేశీయ ఐటీ రంగానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రాంతం ఉత్తర అమెరికా. అయితే అమెరికాలో కొంత బ్యాంకింగ్ సంక్షోభం ఉండటంతో TCS ఆదాయం తగ్గిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. యూకే ఆదాయం అత్యధికంగా 16.1 శాతం వృద్ధి చెందింది. లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ రంగం ఆదాయం 10.1 శాతం పెరగ్గా, బీఎఫ్‌ఎస్‌ఐ ఆదాయం 3 శాతమే అధికమయ్యింది.

నికరంగా 523 మంది ఉద్యోగుల్ని కొత్తగా చేర్చుకున్న టీసీఎస్‌ 

ఈ త్రైమాసికంలో టీసీఎస్‌ నికరంగా 523 మంది ఉద్యోగుల్ని కొత్తగా చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,15,318కు పెరిగినట్టు హ్యుమన్‌ రిసోర్సెస్‌ చీఫ్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. వలసల రేటు క్యూ1లో మరింత తగ్గి, 17.8 శాతానికి దిగింది. కాగా TCS కంపెనీలో మొత్తం ఉద్యోగుల్లో 35.8 శాతం మహిళలు ఉండటం విశేషం. ఈ కంపెనీ షేర్ ప్రస్తుతం 3 శాతం పెరిగి 3,358 వద్ద ట్రేడ్ అవుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe