ఇప్పటి దాకా ఐటీ, ఈ కామర్స్ సంస్థలు మాత్రమే ఉద్యోగులకు లేఆఫ్ లు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ వచ్చి చేరింది. తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో అమెరికా, కెనడాలోని సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. మొత్తం 3 వేల మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని సమాచారం.
తాజాగా లేఆఫ్స్ ప్రభావం అన్ని స్థాయిల్లో ఉన్న ఉద్యోగులపై వేటు పడనుంది. అయితే ఇందులో ఎక్కువగా ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉండటం గమనార్హం. లేఆఫ్ లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. మరోవైపు భారత్‌తో సహా.. ఇతర దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇందులో భాగంగా ఉద్యోగుల్ని ఒక్కొక్కరిగా తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు, ఐటి కంపెనీలు బ్యాడ్ టైమ్‌లో ఉన్న వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. గతవారం, రెండు అతిపెద్ద టెక్ కంపెనీలు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ యొక్క CEO మరియు మైక్రోసాఫ్ట్ CEO ఇద్దరూ తొలగింపులకు పూర్తి బాధ్యత వహించారు. కంపెనీలు సంవత్సరాలుగా భర్తీ చేసినట్లు సూచించాయి. దీని తరువాత, భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఐటీకి ముందు, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ మరియు సేల్స్‌ఫోర్స్‌తో సహా అనేక కంపెనీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.