ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల సమయంలో అకస్మాత్తుగా కురిసే వర్షానికి బట్టలు తడిసిపోవడం ఖాయం. అటువంటి పరిస్థితిలో బట్టలు తడిగా ఉండడంతో పాటు సరిగ్గా ఆరవు. దీంతో బట్లలన్నీ ముతక వాసన వస్తుంటాయి. అయితే దుస్తులను ఇంట్లో ఆరబెట్టడానికి చాలా సమయం పడుతుంది. వాషింగ్ మెషీన్ డ్రైయర్ ఉపయోగించినా సరే బట్టలు ఒక్కోసారి ఆరవు. ఇలాంటి బాధల నుంచి విముక్తి కలిగించి మిమ్మల్ని బయటపడేందుకు మార్కెట్‌లోకి పోర్టబుల్ డ్రైయర్ రూపంలో పరిష్కారం దొరికింది.
కౌంటర్‌టాప్ డ్రైయర్..
మోరస్ జీరో అనే ఈ పోర్టబుల్ 'వాక్యూమ్ + డీహైడ్రేషన్ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి కౌంటర్‌టాప్ టంబుల్ డ్రైయర్' అని మార్కెట్‌లో మంచి పేరుగాంచింది. అసలు మ్యటర్ ఏంటంటే.. ఇది చాలా స్పీడ్‌గా బట్టలు ఆరబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే దాదాపుగా 15 నిమిషాల్లో బట్టలన్నింటిని శుభ్రం చేస్తుందన్నమాట. అలాగే ఇది ఈ ప్రక్రియలో 40 శాతం వరకు కరెంట్ శక్తిని ఆదా చేస్తుంది. నీరు త్వరగా ఆరిపోతుంది..
మినీ డ్రైయర్ వేడిని, లోపల తగ్గిన గాలి పీడనాన్ని మిళితం చేయడం వల్ల నీరు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. మోరస్ జీరో ఇప్పటికే కిక్‌స్టార్టర్‌లో దాని లక్ష్యాన్ని 10 రెట్లు పెంచింది. ఈ యూనిట్ $299 (దాదాపు రూ. 25,000) నుంచి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం రివ్యూలు చదివి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే మీరు కొనుగోలు చేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాలి.