జార్ఖండ్‎లో నదిలో పడిన బస్సు, ఆరుగురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు..!!

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డుమ్రీ గ్రామంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు.

author-image
By Bhoomi
జార్ఖండ్‎లో నదిలో పడిన బస్సు, ఆరుగురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు..!!
New Update

జార్ఖండ్‌లోని గిరిడిహ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన రాత్రి 8.40 గంటల ప్రాంతంలో జరిగింది. బస్సు నదిలో పడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుంది. సహాయక చర్యల అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని జార్ఖండ్ ఆరోగ్య,విపత్తు నిర్వహణ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బస్సు నదిలో పడటంతో చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. కొంతమందిని రక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు రాంచీ నుంచి గిరిదిహ్ వైపు వెళ్తోంది. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా గిరిదిహ్‌-దుమ్రి రహదారిపైకి చేరుకుంది. బస్సు రెయిలింగ్ విరిగి 50 అడుగుల దిగువన ఉన్న నదిలో పడిపోయింది. ఒక్కసారిగా బస్సులో నుంచి అరుపులు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. బస్సు నదిలో పడిపోవడానికి చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు , స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని తెలిపారు. రాంచీ నుంచి గిరిడిహ్‌కు వెళ్తున్న బస్సు గిరిదిహ్‌లోని బరాకర్ నదిలో ప్రమాదానికి గురైందని విచారకరమైన వార్త అందిందని సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

#jharkhand #bus-falls-into-river-in-giridih
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe