Bus Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి 

ఔటర్ రింగ్ రోడ్డుపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి.. బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

New Update
Bus Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి 

Bus Accident: నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు బస్సు చక్రాల కింద నలిగి చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి బయలుదేరిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళుతున్న క్రమంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.

Bus Accident: పోలీసులు నార్సింగ్ ఓఆర్‌ఆర్‌కు చేరుకుని తనిఖీ చేశారు. ట్రావెల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. పోలీసులు గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును బయటకు తీశారు. 

ప్రమాదానికి కారణం?
Bus Accident: హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత, డ్రైవింగ్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా అనే అనుమానంపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇందులో రీడింగ్ ఎక్కువ పాయింట్లు వచ్చినట్టు తెలిసింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టి వాహనం బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై బస్సు బోల్తా పడడంతో అప్ప కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను కొన్ని గంటలపాటు దారి మళ్లించారు.

Advertisment
తాజా కథనాలు