నా భర్త మృతిపై అనుమానాలున్నాయి.. SRO భార్య షాకింగ్ కామెంట్స్.!

బుక్కపట్నం SRO శ్రీనివాస్ జీవితం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక లాడ్జిలో శవమై వేలాడుతూ కనిపించాడు. అయితే, అతని మృతిపై భార్య అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన భర్త సిమ్ కార్డ్ లేదని, చనిపోయిన ప్రాంతంలో చెప్పులు, డ్రెస్ వేరేగా వేరేగా ఉన్నాయని వాపోతోంది.

New Update
నా భర్త మృతిపై అనుమానాలున్నాయి.. SRO భార్య షాకింగ్ కామెంట్స్.!

Bukkapatnam SRO Srinivas Naik: శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42) జీవితం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని మాధవాపురం ప్రాంతంలోని ఒక లాడ్జిలో శవమై వేలాడుతూ కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..ఈ నెల 22న బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడని.. అయితే, అదే రోజు ఆయన అదృశ్యమయ్యాడన్నారు. శ్రీనివాసనాయక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో శ్రీనివాసనాయక్ ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. మృతదేహాన్ని చెన్నై నుంచి స్వగ్రామమైన పెనుకొండ మండలం గోనిపేటకు తరలించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

Also read: చంద్రబాబుకు BIG SHOCK

అయితే, శ్రీనివాస్ మరణంపై అతడి భార్య అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన భర్త అత్మహత్య చేసుకునే పిరికివాడుకాదని వాపోతోంది.  ఆత్మహత్య జరిగిన ప్రాంతంలో సిమ్ కార్డు మిస్ అయిందని, చెప్పులు, దుస్తులు వేరుగా ఉన్నాయని అన్నారు. మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూతురు మాట్లాడుతూ.. "మా నాన్నది కచ్చితంగా హత్యేనని అన్నారు. అసలు విండోకు ఎలా ఆత్మహత్య చేసుకుంటారని ప్రశ్నించింది.  అందరూ చెప్పిన ప్రకారం చనిపోయినప్పుడు మా నాన్న కాళ్ళు నేలకు ఆనుకుని ఉన్నాయని.. అయితే, మనిషి కాళ్ళు నేలపైనే ఉంటే ఎలా చనిపోగలడు అని ప్రశ్నించింది.

శ్రీనివాస్ మృతిపై ఆందోళన చేయడంతో డీఎస్పీ అక్కడికి చేరుకుని సంఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం శ్రీనివాసనాయక్ అంత్యక్రియలను నిర్వహించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ శ్రీనివాసనాయక్ విదులపట్ల ఎంతో అంకి తభావంతో పనిచేసేవారన్నారు. అతను అవినీతి చేశారంటే నమ్మసక్యం కావడం లేదన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు