Buggana: కోర్టు తేల్చే వరకు ఓపిక పట్టు..పయ్యావులకు బుగ్గన కౌంటర్..! స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన కౌంటర్ ఇచ్చారు. స్కిల్ వ్యవహారంలో గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేస్తోందని అన్నారు. కోర్టు తేల్చేంత వరకు పయ్యావుల కాస్త ఓపిక పట్టాలని సూచించారు. By Jyoshna Sappogula 02 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Buggana Rajendranath: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 50 రోజులైనా వైసీపీ ప్రభుత్వం ఏమీ తేల్చలేకపోయారని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కనీసం 50 పైసల అవినీతిని కూడా ఈ ప్రభుత్వం చూపలేకపోయిందని విమర్శించారు. స్కిల్ అంశంలో, నిధుల విడుదలకు ముందే 10 శాతం పెట్టుబడి అనే విషయం స్పష్టంగా ఉందని వెల్లడించారు. సీమెన్స్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం 2017లోనే ఒప్పందం కుదుర్చుకుందని, కేంద్రం కూడా 90:10 నిష్పత్తిలోనే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇది మంచి ఒప్పందం అని కేంద్ర కార్యదర్శి లేఖ కూడా రాశారని పయ్యావుల వివరించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఒప్పందంపైనా ఈడీతో విచారణ చేయించాలంటారా? అని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. స్కిల్ కేసులో 2017 నుంచి విచారణ జరుగుతోందని తెలిపారు. జీఎస్టీ వల్ల స్కిల్ స్కాం బయటపడిందని, దీనిపై జీఎస్టీ, ఈడీ, సెబీ కూడా విచారణ జరిపాయని వివరించారు. ఇంతటి తీవ్రత ఉన్న కేసులో సీఐడీ విచారణ చేయకూడదా? అని బుగ్గన ప్రశ్నించారు. Also Read: వైసీపీ పాలనలో అవినీతి..హైకోర్టులో పిల్ చేసిన ఆ పార్టీ ఎంపీ..! స్కిల్ వ్యవహారంలో గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేస్తోందని అన్నారు. ఏ విధంగా చూసినా ఈ కుంభకోణంలో రూ.250 కోట్లకు లెక్కలు దొరకడంలేదని బుగ్గన వ్యాఖ్యానించారు. టీడీపీ నేత పయ్యావుల కాస్త ఓపిక పట్టాలని హితవు పలికారు. ఈ వ్యవహారం కోర్టు తేల్చిన తర్వాత పయ్యావుల మాట్లాడితే బాగుంటుందని అన్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా లేదని టీడీపీ నేతలు అంటున్నారని, న్యాయస్థానానికి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తారు తప్ప బహిరంగంగా ప్రదర్శించరని తెలిపారు. #payyavula-keshav #buggana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి