Buggana: ఇందుకే జీతాలు,పెన్షన్ల జాప్యం..బుగ్గన సంచలన వ్యాఖ్యలు.!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న బుగ్గన..ఆర్థికంగా మాత్రం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని వెల్లడించారు.అందుకే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.

New Update
Buggana: ఇందుకే జీతాలు,పెన్షన్ల జాప్యం..బుగ్గన సంచలన వ్యాఖ్యలు.!

Buggana Rajendranath:  వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని చెప్పారు. ఆర్థికంగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ కారణం వల్లే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు.

Also Read: జగన్ కు సుప్రీం షాక్.. అక్రమాస్తుల కేసులో నోటీసులు.!

రాష్ట్రంలో రాబడి పెరిగిందని, తలసరి ఆదాయం పెరిగిందని భూమన తెలిపారు. ఇప్పటి వరకు ఏపీకి ఉన్న అప్పు గత 60 ఏళ్లలో చేసిందేనని.. వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో చేసింది కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అప్పుల లెక్కలను చెప్పింది కేంద్ర ప్రభుత్వం, కాగ్ అని..కాగ్ ఇచ్చిన లెక్కలపై మళ్లీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమిటని ప్రశ్నించారు. కాగ్ లెక్కలను కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిందని చెప్పారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంచన కోసం ఫోరన్సిక్ ఆడిట్ జరిపించాలని , శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుతూ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లేఖ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల పైన, ముఖ్యంగా బెవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థల పైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలన్నారు.  రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మోత్తం రాష్ట్ర అప్పుల పైన అడిగిన ప్రశ్నకు  జవాబుగా కేవలం ఆర్బీఐ కు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహ చేసిన ఇతర అప్పులను చెప్పలేదన్నారు.  పార్లమెంట్ లో ఇచ్చిన ఈ సమాధానంను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా ,  లక్షలాది వాలంటీర్ల ద్వార బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రచారం చేస్తున్నదన్నారు.  రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పలు నుండి బయట వేయలనే రాష్ట్ర బిజేపి ప్రయత్నలను తప్పుగా చిత్రీకరించారని లేఖ ద్వారా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు