Buddha Venkanna: విజయవాడలో టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న(Buddha Venkanna) మాజీ మంత్రి కొడాలి నాని(kodali nani)పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ మండిపడ్డారు. అతడికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పానని కామెంట్స్ చేశారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని తెలిపారు.
Also Read: జనసేన లోకి అంబటి రాయుడు..!
ప్లీజ్ రేబీస్ ఇంజెక్షన్లు వేయండి..
ఈ సందర్భంగా కొడాలి నాని ఊరంతా తిరుగుతానని అంటున్నాడు.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నానని కామెంట్స్ చేశారు. తన సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నట్లు తెలిపారు. జనాల సెఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నానని అన్నారు. చంద్రబాబును తిడితే కొడాలి నాని రెండు కాళ్ళూ విరక్కొట్టి పోయ్యిలో పెడతానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అదంతా అభూతకల్పన..
ఈ సందర్భంగా కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే.. అదంతా అభూతకల్పన అంటూ వ్యాఖ్యనించారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవి, చంద్రబాబు వని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారధి నేను.. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను అంటూ పేర్కొన్నారు.
బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు
మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలని అన్నారు టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న. అయితే, డబ్బులు టైట్ గా ఉన్నాయని.. చూసుకుని పంపిస్తానని కౌంటర్లు వేశారు. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలు చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే 'I am BC... చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు' అని చెప్పుకొచ్చారు.