AP Politics: కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు 2000 పంచే దీనస్థితికి వచ్చారంటే ప్రజల్లో వ్యతిరేకతోందని ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు. జగన్ డబ్బులు ఇవ్వలేదని ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పాలంటూ ఆయన సవాల్ చేశారు. ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా, ఎంపీలుగా చేసిన వాళ్లు ఈరోజు ఓటర్లకు భయపడి పరిస్థితి ఉందన్నారు. ఎక్కడ మాకు వ్యతిరేకత ఉందో అని ఓటుకు 2000 పంచుకునే స్థితికి వచ్చారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే అని ఆయన దీమా వ్యక్తం చేశారు. మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని జగన్ అంటున్నారు.. మంచి జరగడమంటే కరెంట్ బిల్లు పెరగడమా.? రైతులకు ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు పంపిణీ చేయకపోవడం మంచా..? దాదాపు 1400 మంది జగన్‌రెడ్డి మందు తాగి చనిపోవడం అది నువ్వు కుటుంబానికి చేసే మేలా.? మద్యం నాసిరకంగాను, అధిక రేట్లకు అమ్మడం మేలా..? ఒక్క ఇండస్ట్రీ తెచ్చేదానికి కూడా మీకు లేదు..? ఇక్కడ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం మేలా..? అంటూ బీటెక్ రవి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగ ఓట్లు వేయడం, బూత్ క్యాప్చార్ గానీ చేస్తే సహించమని ఆయన ఫైర్ అయ్యారు. మా ఏజెంట్లకు ఏ చిన్న అవమానం జరిగినా ఒప్పుకునేది లేదన్నారు. అలా కాదంటే నేను కూడా ఫ్యాక్షన్ కుటుంబమే.. చావడానికైనా చంపాడానికైనా సిద్ధమన్నారు. దొంగ ఓట్లను వేస్తే పోలీసులకు పట్టివ్వడం జరుగుతుంది, దీంతో జీవితంలో అన్నీ కోల్పోతారని ఆయన హెచ్చరించారు. ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లను వేసుకోనివ్వండన్నారు. ప్రతీసారి జగన్ ఇది పేదవాడికి, పెత్తందారికి పోటీ అంటున్నారు. అదే కరెక్ట్ అయితే పేదవాడిని నేను.. 750 కోట్లు చూపించుకున్న వ్యక్తి పెత్తందారి. కాబట్టి పేదవాడిని అయిన నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నానని పులివెందుల నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు వైఎస్ కుటుంబానికి ఛాన్స్ ఇచ్చారు.. ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కోరారు. నాకు ఓటు వేసి గెలిపించాక నేను ఏమిటో.. నేను ఏమి అభివృద్ధి చేస్తానో చూడండి అంటూ బీటెక్ రవి తెలిపారు.
ఇది కూడా చదవండి: పసుపు పాలు లేదా నీరు? ఏది ఎక్కువ ఆరోగ్యకరం?