మీకు అండగా నేనుంటా..BSP మధు ముదిరాజ్ భరోసా.!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చట్ పూజల్లో పాల్గొన్నారు బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాను గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

మీకు అండగా నేనుంటా..BSP మధు ముదిరాజ్ భరోసా.!
New Update

BSP: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చట్ పూజల్లో పాల్గొన్నారు ఆ నియోజకవర్గం బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంత హడావుడిలో కూడా నాపై మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు అని తెలిపారు. ఏనుగు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు..తాను గెలిచిన వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Also read: కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..?

అయితే, నియోజకవర్గంలో బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇస్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ గుట్ట మీద సర్వే నెంబర్ 496లో... 2007 సంవత్సరంలో పట్టాలు పొంది ఇళ్ళు కట్టుకున్న వారిని అక్బర్ అతని అనుచరులు దౌర్జన్యంగా దాడి చేశారని వెల్లగక్కారు. అన్యాయంగా వారి ఇళ్లను కూల్చి వేశారని కన్నీటి పర్యంతం చెందారు. ప్రభుత్వం ఈ భూములు మాకు పట్టా చేశాయని.. మేము ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం అని ఎంత చెప్పిన వినకుండా బెదిరించి, భయబ్రాంతులకి గురిచేసారని బాధితులు వాపోయారు. తాము కుటుంబసభ్యులతో రోడ్డున పడ్డామని బోరున విలపించారు. తమకి ఇళ్ళు లేకుండా చేసారని.. పిల్లలతో తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. మా సమస్య ఇది.. ఇలా జరిగింది అని ఎవరికీ చెప్పిన పట్టించుకోపోగా తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సిరిసిల్లలో బంతిలో దూరిన ఎలుక ఏం చేసిందో తెలుసా? వైరల్ గా మారిన ఫన్నీ వీడియో!

వారి బాధను అర్థం చేసుకున్న మధు ముదిరాజ్..తాను అండగా ఉంటానని థైర్యం చెప్పారు. ఎటువంటి ఆపద రాకుండా ప్రతి ఒక్కరికి పక్క ఇళ్ళు కట్టించి రెగ్యులరైజ్ చేయిస్తా అని భరోసా కల్పించారు. ఎవరు అధైర్యం పడొద్దని..వారికీ ధైర్యం చెప్పి అండగా నిలిచారు పటాన్‌చెరు బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. ఈ కార్యక్రమంలో బీఎస్పి పార్టీ నాయకులు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

#sangareddy-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe