ఢిల్లీలో దారుణం..ముక్కలు ముక్కలు చేసి మహిళ దారుణ హత్య..!! దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరవకముందే అదే తరహాలో మరో భయానక ఘటన జరిగింది. ఓ యువతిని అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్లైఓవర్ కింద పడేశారు. మహిళ శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. By Bhoomi 12 Jul 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. శ్రద్ధా వాకర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్య ఘటన మరవకముందే అదే తరహాలో మరో దారుణ హత్య జరిగింది. ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో గీత కాలనీలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ కింద యువతి శరీర భాగాలు ముక్క ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళ శరీరానికి సంబంధించిన అన్ని భాగాలు లభించకపోవడంతో ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. యువతిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్లైఓవర్ కింద పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతురాలికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మృతురాలి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంత కాలంలో ఢిల్లీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఢిల్లీ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన...నిత్యం మహిళలపై ఆఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి