BRS Leader Murder: వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ నేతను నరికి చంపారు దుండగులు. మృతుడు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డిగా గుర్తించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు. అర్థరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిపై దాడి చేశారు. తల నరికి అతిదారుణంగా దుండగులు చంపేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు.
రాజకీయ కక్షలా? భూతగాదాలా?, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీధర్‌రెడ్డి హత్య స్థానికంగా సంచలనంగా మారింది. శ్రీధర్‌రెడ్డి హత్యపై స్పందించారు హర్షవర్థన్ రెడ్డి. రాజకీయ కక్షతోనే చంపేశారని ఆరోపణలు చేశారు. కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని హర్షవర్థన్‌రెడ్డి అన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్యపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.