KTR: తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే రూ.వేయి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా ఈ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్ తో జరిగిందన్నారు.

New Update
KTR: తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR Fired On CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ధ్వజమెత్తారు. ఈ రోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) అంటే స్కీములు, కాంగ్రెస్ (Congress) అంటే స్కాములు అని అన్నారు.
ఇది కూడా చదవండి:  రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా అమలు ఎప్పుడంటే..

గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉందన్నారు కేటీఆర్. రైతులు పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్న ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఖజానాకు కాంగ్రెస్ గండి కొడుతుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు కేటీఆర్. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్ తో జరిగిందన్నారు. కేటీఆర్ ఫుల్ ప్రెస్ మీట్ ను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు