KTR: రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతంలో.. 'కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప', 'గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్' అని ఉంటాయని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.

KTR: రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
New Update

పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రాజముద్రను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన X ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్ర తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అంటున్నారని ఫైర్ అయ్యారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్'' అని పాడుకోవాలి !!?? అని అన్నారు.

“కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?? అని పేర్కొన్నారు. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe