Breaking: కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది ఇతడే.. ఫొటో రిలీజ్ చేసిన బీఆర్ఎస్!

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిందితుడి ఫొటోను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన్వ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు.

New Update
BREAKING: రఘునందన్ రావు ఓటమి.. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నిందితుడి ఫొటోను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేశారు. మద్యం మత్తులోనే అతడు దాడికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ రోజు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికంటూ వచ్చి ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచాడు. దీంతో పొట్ట భాగంలో ఆయనకు గాయమైంది. దీంతో హుటాహుటిగా గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు హైల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుడు మద్యం మత్తులోనే దాడి చేశాడా? లేక ఏమైనా కుట్ర దాగి ఉందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలన్నారు.

Advertisment
తాజా కథనాలు