Hyderabad: తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ కొత్త రాష్ట్ర చిహ్నం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పెట్టారు. అయితే, ఈ లోగోపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Also Read: ప్రియుడి టార్చర్.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!
చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ తొలగించడంపై నిరసన చేపట్టారు. హైదరాబాద్‌కు చార్మినార్ ఐకాన్ అని.. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్ అని కేటీఆర్ అన్నారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను ప్రభుత్వం తొలగిస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.