TS Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో కొత్తగా TRS.. మరి BRS కు ఇబ్బందేనా?

రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS) పేరిట ఓ కొత్త పార్టీ బరిలోకి దిగనుంది. దీంతో బీఆర్ఎస్ గా మారిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ కొత్త TRS పార్టీకి గ్యాస్ సిలిండర్ ను గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్.

TS Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో కొత్తగా TRS.. మరి BRS కు ఇబ్బందేనా?
New Update

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు (BRS) టీఆర్ఎస్ (TRS) రూపంలో షాక్ తగిలే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కాదా.. ఇదేంటి అనుకుంటున్నారా?.. అయితే.. ఈ స్టోరీ చదవండి. తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS) ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యింది. ఈ పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ ను ఈసీ కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే .. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ని భారత్ రాష్ట్ర సమితిగా ఏడాది క్రితం మార్చారు సీఎం కేసీఆర్. అయితే.. ప్రజల్లో ఇంకా టీఆర్ఎస్ పేరే వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Sarpanch Navya: పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా.. సర్పంచ్ నవ్యతో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..!! 

ఈ నేపథ్యంలో ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీ రాకతో ఓటర్లు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా? తద్వారా తమ ఓట్లకు ఏమైనా గండి పడుతుందా? అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కారును పోలిన గుర్తులతో అనేక చోట్ల నష్టపోతోంది. రోడ్ రోలర్, ట్రక్కు గుర్తులతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థుల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థులు అనేక చోట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని అనేక సార్లు కోరింది.|

CEO Telangana (Allotment) (Telangana Rajya Samithi) 18.10.2023 (1) (1)

కానీ సానుకూల స్పందన రాకపోవడంతో ఆ పార్టీలో నిరాశ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆ తలనొప్పి ఉండగా.. కొత్తగా ఈ టీఆర్ఎస్ నొప్పి మొదలైందన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. గుర్తు కూడా తమ కారు సింబల్ కు దగ్గరగా ఉంటే ఇబ్బంది ఉండేదని.. కానీ కేవలం పార్టీ పేరు మాత్రమే దగ్గరగా ఉండడంతో సమస్య ఉండదని బీఆర్ఎస్ పార్టీలోని మరికొందరు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#telangana-elections-2023 #brs #trs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe