National Integration Day: తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి: కేసీఆర్

భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైన సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

New Update
National Integration Day: తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి: కేసీఆర్

National Integration Day: భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైన సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు సీఎం ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేకత ఉందని హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజును.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామన్నారు. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని.. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో యోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. తెలంగాణ సాధనతో తన జన్మ సార్ధకమైందని తెలియజేశారు. దేశం తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి అని కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. మరోవైపు సూర్యాపేట పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ప్రభుత్వ విప్, చీఫ్ విఫ్‌లు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. గత ఏడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించడంతో పాటు వాడవాడలా జాతీయ జెండాలను ఎగురవేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరులకు అమిత్ షా నివాళులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు