ఎవరి కథ ఏందో కేసీఆర్‌కు తెలుసు: ముత్తిరెడ్డి

గత రెండు రోజులుగా జనగామ బీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెక్ పెట్టే దిశగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ముత్తిరెడ్డి తన వర్గం నేతలతో సమావేశమయ్యారు.

ఎవరి కథ ఏందో కేసీఆర్‌కు తెలుసు: ముత్తిరెడ్డి
New Update

జనగామ బీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెక్ పెట్టే దిశగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ముత్తిరెడ్డి తన వర్గం నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి నేతలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మీటింగ్ పెట్టారో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు.

తనకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు తీర్మానం చేశారని తెలిపారు. తన కూతరు తనపై చేసిన అవినీతి ఆరోపణలు కుటుంబ సమస్యగా చూస్తానని వెల్లడించారు. తన నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ బుధవారం జరిగిన మీటింగ్‌లో లేరని క్లారిటీ ఇచ్చారు. మీటింగ్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళానని.. రూంలో ఉండి తలుపులు పెట్టుకున్నారన్నారు. అలా భయపడి బతకటం ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డంపడితే కఠినంగా వ్యవహరించానని.. గూండాలను కంట్రోల్ చేసిన గూండానని పేర్కొన్నారు.

కొంతకాలంగా ముత్తిరెడ్డి యాదగిరికి, స్థానిక నేతలకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని.. ఇంకెవరిక ఇచ్చినా సహకరిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చెప్పేశారు. ఈ క్రమంలోనే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. మరోవైపు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తిరెడ్డి మీడియాతో సహా అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె భవానిరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న భూమి లీజ్ అగ్రిమెంటు మార్చారని కేసు పెట్టారు. అలాగే చేర్యాల భూమి విషయంలోనూ అందరిముందే ఆమె ముత్తిరెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలో తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని కంటితడి కూడా పెట్టుకున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe