వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నట్లు ప్రకటించారు. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజలతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..నెల జీతం విరాళం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు
వరద బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు.
Translate this News: