TG: కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్!

TG: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేటీఆర్‌, హరీష్ రావును ఎత్తుకెళ్ళి వ్యాన్‌లో ఎక్కించారు.

New Update
TG: కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్!

KTR: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చారు మార్షల్స్‌. అసెంబ్లీలో ఆవరణలో కూడా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. హరీష్‌రావు, కేటీఆర్‌లను వ్యాన్‌ లో తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉదయం నుంచి అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరససన చేశారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో సీఎం చాంబర్‌ ఎదుట నిరసనకు దిగారు. క్షమాపణ చెప్పేవరకూ కదిలేది లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మార్షల్‌ సాయంతో ఎమ్మెల్యేలను బయటకు తరలించారు పోలీసులు. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవనకు వారిని తరలించారు పోలీసులు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు