BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్!

జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్!
New Update

జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హరీశ్, కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారిందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారన్నారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. దానం నాగేందర్ మాట్లాడే భాష... రౌడీ షీటర్ మాట్లాడే భాషలా ఉందని ధ్వజమెత్తారు. కన్న తల్లులను అవమానపరిచేలా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారన్నారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ హయంలో ఎన్నడూ ఇలా చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ దానం నాగేందర్ ఇలానే మాట్లారని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ గా అయిపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ పై చర్చ చేద్దామంటే.. చేయకుండా పారిపోయారని విమర్శించారు. మోసం చేసినందుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టమన్నారు.

శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే..
శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని హరీశ్‌ రావు అన్నారు. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకీ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా? అని ప్రశ్నించారు. ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe