జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హరీశ్, కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారిందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారన్నారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. దానం నాగేందర్ మాట్లాడే భాష… రౌడీ షీటర్ మాట్లాడే భాషలా ఉందని ధ్వజమెత్తారు. కన్న తల్లులను అవమానపరిచేలా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్!
జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
Translate this News: