Sabitha Vs Revanth: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి
అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. తనను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటూ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. పార్టీ మారారని తనను అనే హక్కు మీకు లేదని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. తాము పార్టీ మారలేదని.. బయటకు మెడ పట్టి గెంటేశారని ధ్వజమెత్తారు. తమ కుటుంబానికి ఓ చరిత్ర ఉందన్నారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీకి పనిచేశానన్నారు. అసెంబ్లీలో మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి:CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని ఫైర్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్నా తాము కమిట్ మెంట్ తో పనిచేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. తమను అవమానిస్తే రాష్ట్ర మహిళలను అవమానించినట్లేనన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు. దొంగలే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ నేతల వ్యవహారం ఉందన్నారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి:TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!
Sabitha Vs Revanth: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి
అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. తనను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటూ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. పార్టీ మారారని తనను అనే హక్కు మీకు లేదని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. తాము పార్టీ మారలేదని.. బయటకు మెడ పట్టి గెంటేశారని ధ్వజమెత్తారు. తమ కుటుంబానికి ఓ చరిత్ర ఉందన్నారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీకి పనిచేశానన్నారు. అసెంబ్లీలో మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని ఫైర్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్నా తాము కమిట్ మెంట్ తో పనిచేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. తమను అవమానిస్తే రాష్ట్ర మహిళలను అవమానించినట్లేనన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామన్నారు. దొంగలే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ నేతల వ్యవహారం ఉందన్నారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!