ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి యాక్సిడెంట్

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మంగళూరులో ఇది జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి రోహిత్ రెడ్డి కారు చెట్టును ఢీకొట్టింది. ప్రజలందరి ఆశీర్వాదాలతో తాను క్షేమంగానే ఉన్నానని రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రమాదం నిజమే కానీ, తనకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.

New Update
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి యాక్సిడెంట్

BRS MLA Pilot Rohith Reddy car accident

ఈమధ్య వరుసగా ఆధ్యాత్మిక టూర్లు చేస్తున్నారు రోహిత్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెల 3న తాండూరులో తలపెడుతున్న రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని కోరారు.

శనివారం కర్ణాటకలోని శృంగేరి పీఠం సందర్శనకు వెళ్లారు రోహిత్ రెడ్డి. అయితే.. మంగళూరు సమీపంలోని ముడూరు-నల్లూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారు.

తాండూరు ప్రజల ఆశీర్వాదాల వల్లే తాను క్షేమంగా ఉన్నానని రోహిత్ రెడ్డి తెలిపారు. తన కారుకు యాక్సిడెంట్ అయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని.. కానీ, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రజలందరి ప్రేమానురాగాల వలన క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు.

ఈమధ్య రోహిత్ రెడ్డి పబ్ లో హంగామా చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మద్యం పొంగిస్తూ, ఇతరులకు తాగిస్తూ ఎంతో హుషారుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదం.. ఇలా ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు రోహిత్ రెడ్డి.

Advertisment
Advertisment
తాజా కథనాలు