Mainampally Hanumantha rao next step: మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(myanampally hanumantha rao) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్(congress)లోకి మైనంపల్లికి అత్యంత సన్నిహితుడు నక్కా ప్రభాకర్‌గౌడ్ వెళ్లనున్నట్టు సమాచారం. మైనంపల్లికి రైట్ హాండ్ ఈ . మేడ్చల్ సీటు ఆశిస్తున్నారు ప్రభాకర్‌గౌడ్(Prabhakar goud). ఇటివలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రహస్యంగా ప్రభాకర్‌గౌడ్ భేటీ అయ్యారు. తన అనుచరుల్ని కాంగ్రెస్‌లోకి పంపడం ద్వారా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓట్లకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజిగిరి, మేడ్చల్, మెదక్, కుత్బుల్లపూర్, ఉమ్మడి నిజామాబాద్, ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ కోసం KLR కిచ్చా లక్ష్మ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
టికెట్ నీకే అంటూ గ్యారెంటీ? :
99 పర్సెంట్ టిక్కెట్ నీకే అంటూ ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్(revanth reddy) హామీ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్‌లో రాజకీయ భవిష్యత్తు లేదు అంటూ మైనంపల్లి తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక 15 రోజుల తరువాత మైనంపల్లి ఓ నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అటు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ రాజకీయ జీవితం కోసం అన్ని వ్యూహాలు రచిస్తున్నారు. హనుమంతరావు మల్కాజిగిరి నుంచి రెండోసారి అభ్యర్థిగా, మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరగా, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరాకరించారు. మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మొగ్గు చూపారు. తన కుమారుడి అభ్యర్థిత్వంపై జిల్లా మంత్రి హరీశ్‌రావు ప్రభావం ఉందంటూ హనుమంతరావు చేసిన విమర్శలపై రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. మెదక్‌లో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న మైనంపల్లి.. ఇప్పుడు హఠాత్తుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మ మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలోనే మైనంపల్లి తన కుమారుడిని కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. సెప్టెంబర్ 17న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అల్వాల్‌లో గొడవ:
హైదరాబాద్ అల్వాల్‌లో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా (BJYM) కార్యకర్తలతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు గొడవ పడడంతో ముగ్గురు గాయపడ్డారు. రాక్ గార్డెన్ అవెన్యూ స్థలంలో మైనంపల్లి భూ కబ్జాకు వ్యతిరేకంగా BJYM కార్యకర్తల బృందం దాని కోశాధికారి సాయి ప్రసాద్ నేతృత్వంలో ర్యాలీ చేపట్టినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. కొంతమంది భూమి హక్కుదారులకు మద్దతుగా BJYM స్థానిక నాయకులు ర్యాలీ చేపట్టారు. దీంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే అనుచరులు BJYM కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని సమాచారం. దీంతో స్పందించిన బీజేవైఎం కార్యకర్తలు రాక్‌గార్డెన్ ఎన్‌క్లేవ్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కార్యాలయంలోని అద్దాలు, కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మైనంపల్లి మద్దతుదారులు బీజేవైఎం కార్యకర్తలపై దాడి చేశారు.
ALSO READ: పోలీసుల అదుపులో కిషన్‌రెడ్డి! దీక్షలో హైటెన్షన్
Mynampally: వ్యూహాత్మకంగా అడుగులేస్తోన్న మైనంపల్లి.. కాంగ్రెస్‌లోకి కీలక అనుచరుడు!
మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైనంపల్లి రైట్ హ్యాండ్ నక్కా ప్రభాకర్‌గౌడ్ కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 99 పర్సెంట్ టిక్కెట్ నీకే అంటూ ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్ రెడ్డికి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన మైనంపల్లి కాంగ్రెస్‌లోకి చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
New Update
Advertisment