MLA KTR: నేడు విచారణకు ఎమ్మెల్యే కేటీఆర్

TG: ఈరోజు మహిళా కమిషన్‌ ముందు ఉదయం 11 గంటలకు విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.

KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!
New Update

MLA KTR: నేడు మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలకాయానికి చేరుకోనున్నారు. ఇటీవల మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను ఉద్దేశిస్తూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క, కొండా సురేఖ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు…

బస్సుల్లో మహిళలు ఎల్లిపాయల పొట్టు తీసుకుంటే తప్పేం ఉందని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. ఇప్పుడు ఆ సెటైర్లే కేటీఆర్ ను యావత్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పేలా చేసింది. అసలు కేటీఆర్ ఏం అన్నారు?… కేటీఆర్ మాట్లాడుతూ .. ” బస్సులో అల్లం ఎల్లిపాయ పొట్టు తీస్తే తప్పేం లేదు అక్క.. కానీ దానికోసమే బస్సు పెట్టిర్రు అని తెలియక ఇన్ని రోజులు మేం మాములుగా నడిపినం.. మాకు తెలవకపాయె పాపం… మీరు అప్పుడే చెప్తే బాగుండు.. ఎక్కువ పెట్టు బస్సులు.. బస్సులు ఎక్కువ సంఖ్యలో లేక తన్నుకుంటుర్రు.. మంచిగా లేదు.. పెట్టు మనిషికి ఒక బస్సు పెట్టు మేమెందుకు వద్దు అంటాము. కుటుంబం కుటుంబం మంచిగా కుట్లు, అల్లికలు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

#ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe