/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-KTR.jpg)
MLA KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 8 నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు చేయటమేనా వాళ్లు చెప్పిన మార్పు అని నిలదీశారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా రూ. 50 వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన అవసరమెమొచ్చిందని ప్రశ్నించారు.
2023 నాటికి రాష్ట్రం 5,900 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంటే 8 నెలల కాలంలో దాన్ని 50 కోట్ల అప్పుగా మార్చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్ పై అప్పులు, అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అపోహలు, అర్థ సత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్ లో నిలుస్తుందన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమధానం చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి 4-5 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రం పై పడడం ఖాయమని చెప్పారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయటంలో కాంగ్రెస్ విజయవంతమైందన్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ది చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
The “Change” that Congress is ushering in a ₹5,900 plus Crore Revenue Surplus in 2023 !
They had spread canards & half-truths about BRS Govt driving the state’s debt up & now they are breaking all sort of records
They’ve just crossed the 50,000 Crore debt mark within 8 months… https://t.co/Of2ptFBrKi
— KTR (@KTRBRS) August 14, 2024