KTR On Valmiki Scam: కర్ణాటకలో స్కామ్.. తెలంగాణ నేతలకు డబ్బులు.. కేటీఆర్ సంచలన ట్వీట్

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.90 కోట్లు అందాయని ఈడీ, సిట్‌ విచారణలో ప్రాథమికంగా తేలిందని చెప్పారు.

KTR : అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు.. ఆ యూట్యూబ్‌ ఛానెల్స్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
New Update

KTR On Valmiki Scam: కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి స్కామ్ కేసులో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఈ స్కామ్ పై కర్ణాటకలో సిట్‌ నివేదిక, ఈడీ, సీఐడీ విచారణ జరిపిందని తెలిపారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన నేతలు ఉన్నారని ఈడీ చెప్పిన తెలంగాణలో మీడియా ఛానెల్ లు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యనే దాదాపు రూ.90 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారని గుర్తు చేశారు.

కేటీఆర్ X లో ప్రశ్నల వర్షం...

* హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులు ఎవరికి ఎస్టీ కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు?
* ఈ స్కామ్ లో రూ.4.5 కోట్లు V6 బిజినెస్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారు.. ఆ బిజినెస్ యజమాని ఎవరు?
* సిట్, సీఐడీ, ఈడీ దాడులు చేసిన తర్వాత కూడా తెలంగాణలోని మీడియా వర్గాల్లో వార్తలను ఎందుకు ప్రసారం చేయలేదు?
* లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు డ్రా చేసి బార్లు, బంగారం షాపులను ఎవరు నిర్వహిస్తున్నారు?. కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?
* కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ఈ స్కామ్‌లో రూ. 90 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు.
* మరీ ముఖ్యంగా సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి ఎందుకు అన్నారు? దాని అర్థం ఏమిటి?
* ఇంత సంచలనంగా మారిన ఈ స్కామ్ కు సంబంధించి తెలంగాణలో ఈడీ ఎందుకు సోదాలు చేయడం లేదు?
* తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : నెక్ట్స్‌ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!

వాల్మీకి స్కామ్ అంటే ఏంటి?

2024లోనే కర్ణాటకలో ఈ వాల్మీకి స్కామ్ బయటకు వచ్చింది. ఒక అధికారి సూసైడ్ లెటర్ వల్ల బయటపడ్డ ఈ స్కామ్ అక్కడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌‌కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో రూ.187 కోట్లు ఇల్లీగల్ గా వేరే బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. వాల్మీకి కార్పొరేషన్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ పీ చంద్రశేఖరన్‌ మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. అతను చనిపోయే ముందు ఆరు పేజీల సూసైడ్‌ నోటులో ఈ స్కామ్‌ గురించి వివరించారు.

కాగా అధికారి సూసైడ్, ఈ స్కామ్ పై ప్రతిపక్షాలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్ విచారణ బాధ్యతను సిట్ కు అప్పగించింది. ఈ స్కామ్ ను కేసులో అసలు విషయాలను బయట పెట్టేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్‌’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్‌ విచారణలో తేలింది. కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బసనగౌడ దద్దల్‌, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా మొత్తం 11 మందిని ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్‌ చేసింది.

#brs-mla-ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe