MLA KTR: 8 మంది ఉన్నా ఇచ్చింది గుండు సున్నానే: కేటీఆర్ ఫైర్

తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు కేటీఆర్. 16 మందిని పార్లమెంట్‌కు పంపిస్తే ఒకరు కూడా బడ్జెట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు.

MLA KTR: 8 మంది ఉన్నా ఇచ్చింది గుండు సున్నానే: కేటీఆర్ ఫైర్
New Update

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌ పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని అన్నారు. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని చెప్పారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ (Telangana) ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో (AP Reorganisation Act) దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఐఐఎం సహా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు.

Also Read: కేంద్ర బడ్జెట్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్

తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని.. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కేంద్రం స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదని.. తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని.. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని అన్నారు.

ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళని చెప్పారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి ద్వేషం లేదు, సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు." అని అన్నారు.

Also Read: వరాలే ఎక్కువ.. వాతలు తక్కువే.. బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే

#ktr #union-budget-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe